7, ఫిబ్రవరి 2023, మంగళవారం

ప్రపంచాన్ని ఊపేస్తున్న ChatGPT


            

                         మానవ పరిణామక్రమంలో ఎప్పటికప్పుడు ఎన్నో కొత్త ఆవిష్కరణలు వస్తూ , మనిషి జీవితాన్ని సుఖమయం చేస్తూనే ఉన్నాయి, కొన్ని ఆవిష్కరణ ల ప్రభావం పరిమితంగా ఉంటే, మరికొన్ని ఆవిష్కరణల ప్రభావం అనంతం,  వర్తమాన, భవిష్యత్ కాలాలను, అన్ని రంగాలపైన తీవ్రమైన ప్రభావం చూపుతాయి.. ఇప్పుడొచ్చిన ఆవిష్కరణ అలాంటిదే..

           ChatGPT.. ఈ మధ్య అంతర్జాల ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతున్న సాంకేతికత.. గత నవంబర్ లో ఆవిష్కరణ జరిగిన తర్వాత, గతంలో ఎప్పుడు లేనంతగా, అతి తక్కువ కాలంలోనే కోట్ల మంది అభిమానులను(సభ్యులను ) కూడగట్టుకున్నది..

              ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఆధారంగా పని చేసే ChatGPT, సుత్తి లేకుండా సూటిగా సమాధానాలు చెప్తుంది.. వేగానికే అలవాటు పడ్డ ఈ జనరేషన్ కు తగ్గట్లు రూపొందించబడింది.. ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్ గురువు మీద ఆధారపడ్డ మనకు, ఆ గూగుల్ ఇచ్చే పేజీల కొద్దీ సమాచారంలో, మనకు కావలసిన కంటేంట్ గురించి మళ్ళీ వెతుక్కోవాలి, హోంవర్క్ చేసుకోవాలి.. కానీ కావలసిన సమాచారాన్ని ఇన్స్టంట్ కాఫీ లాగ ఠకిమని క్షణాల్లో ఇచ్చేస్తే... ఆ పని ఇప్పుడు ChatGPT చేస్తున్నది..

     నాక్కూడా ఈ మాయను చూడాలని, గత రెండు రోజులుగా చెక్ చేస్తున్నాను, సొల్లు జోకులు మొదలుకొని, పరిశోధనలు, పరీక్షలు, అణు విజ్ఞానం, అంతరిక్షం, వేదాంతం ఇలా దేని గురించి ఏది అడిగిన క్షణాల్లో జవాబు cryspy గా ఇచ్చింది, ఆఖరికి "చీమ ఏనుగును చంపేన్ " అని అవధానం లెవల్లో సమస్య ను ఇచ్చినా కూడా సింపుల్ గా ఓ నాకోసం ఓ కథ ను వండి పెట్టింది..శాంపిల్ గా నేను చేసిన కొన్ని అన్వేషణలు మీతో పంచుకుంటున్నాను. 

    ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇంత ఈజీగా జీవితాలు మార్చేస్తే ఎలా, అసలు మనిషి క్రియేటివిటి ఏమై పోవాలి.. ఇది మాకొద్దు రా బాబు అని అప్పుడే అమెరికాలో కొన్ని యూనివర్సిటిలలో  నిషేధం కూడా పెట్టారట.. దీని దెబ్బకి గూగులోడు కూడా అబ్బా అనేసి, ఇక ఇలాగైతే తన బిల్డింగ్ కూలిపోతుందని భయపడి తాను కూడా దీనికి బాబు లాంటి "బార్డ్" ను తీసుకొస్తున్నట్లు ఈరోజే తెలిసింది.. ఇక ముందు ముందు ఇంకా ఎన్ని సాంకేతిక వింతలు, విచిత్రాలు చూడాలో..మీరు ఈ chatGPT ని ఓ పట్టు పట్టండి 

Note : Suman TV లో వచ్చిన ఈ ఇంటర్వూ కూడా చూడండి 

https://www.youtube.com/watch?v=yMxc8mCu5lg

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

Some of the sample searches

How to become an astronomer 

Becoming an astronomer requires a combination of education, experience, and passion for the field. Here are the steps to take to become an astronomer:

Get a strong education: A bachelor's degree in astronomy, physics, or a related field is typically the minimum requirement for becoming an astronomer. However, many astronomers go on to earn a master's degree or PhD in astronomy.

Gain experience: Participating in internships, co-op programs, or research projects during your undergraduate or graduate studies can provide valuable hands-on experience and help you develop skills that are important in the field.

Build a strong foundation in mathematics and physics: Astronomy is a highly mathematical and scientific field, so it is important to have a strong foundation in both mathematics and physics.

Study computer science: Astronomers often use complex computer software and algorithms to analyze data, so having a strong background in computer science can be an asset.

Get involved in research: Participating in research projects or collaborating with other astronomers can help you gain valuable experience and make valuable connections in the field.

Attend professional conferences and workshops: Attending professional conferences and workshops can help you st

-----------_---------------------------------------------------

 Which is the best one in all Upanishads 

The Upanishads are a collection of ancient Hindu philosophical texts, and as such, the "best" one can be a matter of personal preference and interpretation. Some of the most well-known and widely studied Upanishads include:

The Brihadaranyaka Upanishad: One of the oldest and most important Upanishads, this text explores the nature of reality and the relationship between the individual self and the ultimate reality.

The Chandogya Upanishad: This Upanishad explores the nature of consciousness and the relationship between the individual self and the ultimate reality.

The Taittiriya Upanishad: This text deals with issues related to meditation and the attainment of higher states of consciousness.

The Katha Upanishad: This Upanishad deals with the nature of death and the afterlife, and is known for its allegorical story of the boy Nachiketa and his journey to the underworld.

The Isa Upanishad: This Upanishad is one of the shortest and most concise, and is often considered to be a summary of the central teachings of the Upanishads.

Each of these Upanishads has its own unique perspectives and insights, and each can offer valuable insights into Hindu philosophy and spirituality. Ultimately, the "best" Upanishad will depend on the individual reader's interests and personal beliefs.

----------=---------------------

 Create a story on an Ant killed an elephant 


Once upon a time, there was a majestic elephant named Ellie who lived in the African savanna. Ellie was the largest and strongest animal in the entire ecosystem, and all the other animals respected and admired her.

One day, while Ellie was out for a walk, she stumbled upon a colony of ants. The ants were busy gathering food and building their home, but Ellie didn't pay much attention to them. She continued on her way, not realizing that she had stepped on one of the ant's mounds, destroying it.

The ants were furious! They felt that Ellie had no right to destroy their home and disrupt their lives. So, they decided to teach her a lesson. They gathered together and marched towards Ellie, determined to take her down.

At first, Ellie didn't take the ants seriously. She laughed and swatted at them with her trunk, but the ants were relentless. They crawled all over Ellie's massive body, biting and stinging her. The pain was so intense that Ellie began to feel weak.

As Ellie stumbled and fell to the ground, the ants continued their attack. They crawled into her eyes and ears, causing her to go blind and deaf. Ellie was now vulnerable, and the ants took advantage of the situation. They climbed into Ellie's trunk and began to crawl down her throat.

Despite her size and strength, Ellie was no match for the determined ants. They slowly ate away at her insides, until Ellie was no more. The other animals in the savanna were shocked and saddened by Ellie's death, but the ants were proud of what they had accomplished.

From that day on, the ants were respected and feared by all the other animals in the savanna. They had proved that size doesn't always matter, and that even the smallest creature can bring down the largest.

22, మే 2022, ఆదివారం

శప్తభూమి


                                                            
                                                             శప్తభూమి
..చాలా రోజుల తర్వాత, పూర్తి అయ్యేదాకా వదలబుద్ది కాకుండా చదివిన పుస్తకం ఇది.. 18 వ శతాబ్దిలో రాయలసీమ  ముఖ్యంగా అనంతపురం ప్రాంతంలో నెలకొన్న సామాజిక,ఆర్థిక,రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను సీమ రచయిత బండి నారాయణస్వామి అద్భుతంగా ఆవిష్కరించిన ఈ  చారిత్రక నవల,   మనల్ని ఆసాంతం ఆకట్టుకుంటుంది.2017 లో తానా వారి ఉత్తమనవల గానే కాక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఉత్తమ రచన ఇది. ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కలిగిన సినిమా చూస్తున్నపుడు మధ్యలో  ఇంటర్వెల్ కూడా ఇరిటేటింగా అనిపిస్తుంది,  ఈ నవల చదువుతుంటే నాక్కూడ సేమ్ టు సేమ్ ఆదే ఫీలింగ్ కలిగింది, ఏ కొద్ది సమయం దొరికినా చాలు ఒకటి రెండు  పేజీలు అయినా సరే తిప్పెయాలనిపించేది ..

                                         ఈ నవల అంతగా నన్ను ఆకట్టుకోవడానికి ప్రధానంగా నేను చరిత్ర విద్యార్థిని కావడం ఒక కారణమైతే , ఆయా పాత్రల చిత్రీకరణ , వాటిని రచయిత నడిపించిన తీరు, ఆ నాటి సామాజిక పరిస్థితులను, మూఢ నమ్మకాలను, విశ్వాసాలను, ఆచార వ్యవహారాలను కళ్ళకు కట్టినట్లు వివరించడం..అత్యద్భుతం.. నాకు దాశరథి రంగాచార్య రచనలు అంటే చాలా ఇష్టం, ఆయన జీవనయానం, మోదుగుపూలు...నాపై చాలా ప్రభావం చూపాయి. ఒక సినిమా చూసినా కానీ, ఒక పుస్తకం చదివినా కానీ, ఆ తర్వాత కూడా ఆ సినిమా , ఆ పుస్తకంలోని పాత్రలు, సన్నివేశాలు కొన్ని రోజుల పాటు మనల్ని వెంటాడుతున్నాయి అంటే అది చాలా  ప్రభావవంతమైన సినిమా/పుస్తకం అనవచ్చు.. ఈ నవల లోని  ఎల్లప్ప జెట్టి, పద్మసాని,కంబళి శరభుడు, హండే రాజు, కోడె నీలడు, ఇమ్మడమ్మ,హరియక్క లాంటి సజీవ పాత్రలు కొంతకాలం పాటు మనల్ని వెంటాడుతాయి..

                               ఈ  రచయిత చెప్పినట్లు ఈ నవల కేవలం ఆ నాటి రాయలసీమ చరిత్రనే కాదు, ఆనాటి దళిత బహుజనుల దైన్య జీవితాలను, పాలెగార్ల ఆరాచకాలను, పైవాల్లకు కప్పాలు చెల్లించడం కోసం   ప్రజలను  దొంగల్లా దోపిడీలు చేసే పాలకులను, భర్త చనిపోతే బలవంతంగా భార్యను చితి ఎక్కించే సతీసహగమనాలు, అగ్రవర్ణాల, పాలకుల కామవాంఛలు తీర్చడం కోసం ఏర్పాటు చేసిన దేవదాసి, బసివిని వ్యవస్థలు, బలహీనవర్గాల పై పాలకులు చేసే లైంగిక దోపిడీలు, సమాజంలో బలంగా నాటుక పోయిన కుల విషవృక్ష పు వికృత ఊడలు, గునిగానప్ప పరసలో  పెళ్లయిన కొత్త దళిత జంటలు గుండుకొట్టించుకొని సున్నం బోట్లు పెట్టుకోవాలని లేకపోతే అరిష్టమనుకోనే  మూడనమ్మకాలు, కరువు కాటకాలతో సతమతం అవుతున్న  సమాజం , వానాల కోసం చేసే ఉత్సవాలు, దేవుడి కోసం గండ కత్తెరతో అంగాంగం కట్టిరించుకుంటూ దేహత్యాగం చేసుకొనే వీర మంటపం లాంటి విశ్వాసాలు ...ఇలా చాలా చాలా విషయాలు ఉన్నాయిందులో.. నవల చదవడం ప్రారంభించినప్పుడు too many characters , facts and incidents అనిపించింది, కానీ ఒకసారి ట్రాక్ లో పడిన తర్వాత ఆ మజానే వేరు..ఇప్పటికే ఇంత మంచి నవల చదవడం ఆలస్యం అయ్యింది, మీరు కూడా చదవండి..సాహితీ లోకానికి మంచి రచనను అందించిన రచయిత Bandi Narayana Swamy  గారికి ధన్యవాదాలతో 🙏

7, జులై 2018, శనివారం

ఎలుకలకు నిలయం ఈ వింత ఆలయం



మూషికాలయం

 

దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళి నా “మిఠాయి పొట్లం”  విప్పుతున్నాను...విషయం అంతలాగా ఉంది కాబట్టి , అర్జంటుగా “అంతర్జాల సహవాసులందరితో పంచుకోవాలనిపించింది..ఇక మొదలెట్టండి ..
కర్ణి మాత ఆలయం ... రాజస్థాన్ లోని  బికనీర్ కు ౩౦ కిలోమీటర్ల దూరంలో ఈ  వింతయిన , విచిత్రమైన ఆలయం ఉంది. నా అధికారిక విధుల్లో బాగంగా బికనీర్ వెళ్ళిన నేను , ఈ ఆలయాన్ని గురించి ఒళ్ళు కంపరం ఎత్తించే , గగుర్పొడించే వింతలు , విశేషాలు విన్న తర్వాత అక్కడికి ఖచ్చితంగా వెళ్లి తీరాలని డిసైడ్ అయిపోయి , వెల్లోచ్చాను...నిజంగానే ఆలయంలోకి అడుగుపెట్టిన నాకు ఒక రకమైన గగుర్పాటు కలిగింది, కారణం...అక్కడ ఒకటి కాదు, రెండు కాదు, పదులు కాదు, వందలు కాదు ...వేలకొద్ది  మూషికాలు చుట్టుముట్టాయి !!.వేలాదిగా ఎలుకలు అటూ ఇటూ తిరుగుతూ నానా హడావిడి చేస్తూ , మన కాళ్ళ మధ్యనుండి పరుగెడుతుంటే , ఎక్కడ వాటిని తోక్కేస్తామేమోననే కంగారు ఓ వైపు, మరో వైపు అవి ఎక్కడ కరుస్తాయోననే భయం..ఇలా లోపలికి అడుగు పెట్టిన తర్వాత భయం, ఆశ్చర్యం,ఆనందం, ఆందోళన ఇలా నవరసానుభూతులు ఒక్కసారే కలిగాయి..భయం , భయంగా “కర్నిమాత “ ను దర్శించుకున్నాను, అక్కడా  అమ్మ వారి చుట్టూ , నైవేద్యాల పళ్ళేల చుట్టూ గుంపులు గుంపులుగా ఉన్నాయి..
కొన్ని నిద్రావస్టలో, మరికొన్ని  భుక్తావస్తలో , ఇంకొన్ని సుప్త చేతనావస్థలో , ఇంకొన్నిఆటల్లో , పాటల్లో ....అబ్బో వండర్ఫుల్ ..అసలు ఆ ఆలయంలో ఇంతగా ఈ ఎలుకల గుంపు ఉండటం వెనుక ఒక కథ ప్రాచారంలో ఉంది.
          అమ్మవారు “కర్నిమాత “ దుర్గామాత ఉపాసకురాలు, ఆమెకు నలుగురు సంతానం , ఆ నలుగురిలో ఒకరు అ ఆకస్మాత్తుగా మరణించడంతో , కర్నిమాత “యమ ధర్మరాజు “ తో గొడవకు దిగుతుంది, ఆయన తోవకు అడ్డుగా నిలుస్తుంది , తన కొడుకును బ్రతికించే , అక్కడినుండి కదులుమని ప్రార్థిస్తుంది ..అయితే సృష్టి ధర్మానికి విరుద్దంగా తానూ వ్యవహరించలేనని యముడు , ససేమిరా అంటూ కర్నిమాత ...ఇక చివరికి మధ్యేమార్గంగా యమధర్మరాజు కర్నిమాత సుతుడికి పునర్జన్మ ప్రసాదిస్తాడు , అయితే అది మానవ జన్మ గా కాక “ఎలుక “ జన్మ ను ప్రసాదిస్తాడు.. ఏమైతేనేమి సతీ సావిత్రి “పతి” కోసం యముడితో పోరాటం చేయగా , కర్నిమాత “సుతుడి” కోసం పోరాడి విజయం సాదించింది..అందుకే భక్తులందరూ అప్పటి నుండి ఈ ఎలుకలని కర్నిమాత సంతానంగా భావించి , వాటిని కూడా అమ్మవారితో సమానంగా భయబక్తులతో ఆరాదిస్తారు , వాటికి కీడు హాని కలిగించే ఎలాంటి చర్య చేపట్టరు ..
          నాకు ఈ ఆలయ వింతలు , విశేషాలు “వి ఐ పి” దర్శనం చేయించిన “దేవేందర్” కర్నిమాత వంశస్తుడు ..మరికొన్ని విశేషాలు నాతో పంచుకున్నాడు , అవి మీ కోసం ...
·        ఇంతగా వేలకు వేలకు గుంపులు గుంపులుగా ఎలుకలు తిరిగినా , ఒక్కసారి కూడా చనిపోయిన  ఎలుఒక్కటి కూడా కనపడలేదట , వినపదలేదట.
·        ఆలయద్వారాలు ఉదయం 4 నుండి రాత్రి 10 గంటల వరకు తెరచివున్నా , ఇవి వేలకు వేలు ఉన్నా ఒక్క ఎలుక కూడా ప్రధాన ద్వారం దాటి బయటికి    వెళ్ళవట..  అంటే  ఎట్టి పరిస్థితుల్లోనూ  “ సరిహద్దు దాటవన్నమాట

ఉదయం నాలుగు గంటలకి మాతకు అభిషేక , నైవేద్య హరతుల అనంతరం చేసే మృదంగ , భేరి నాదాలకు ...అప్పటి వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని “మూషిక దండు “ వేలుగా వచ్చి నైవేద్యాన్ని ఆరంగిస్తాయి.
ఇక అప్పటి నుండి మొదలు
, రాత్రి  వరకు అటు , ఇటూ తిరిగి గోల గోల గా తిరిగి పది కాగానే అన్నీ చటుక్కున మాయమైపోతాయి ( అంటే రెస్ట్ లోకి అని అర్థం }
·        ఎలుకలు నల్లగా ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే , “ఎలుక తోలూ తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా , నలుపు నలుపే కాని తెలుపు కాదు “ అనే పద్యం గుర్తు కూడా వస్తది ..కాని ఇక్కడ “తెల్ల ఎలుకలు “ కొన్ని ఉన్నాయి,  అయితే అవి అప్పుడప్పుడు మాత్రమె కనపడుతుంటాయి ...వాటిని దర్శించుకుంటే “దరిద్రం “ అంతా పోతుందని , మంచి రోజులు మస్తుగా వస్తాయని నమ్మకంతో ఉదయం నుండి రాత్రి వరకు భక్తులు గంటలు గంటలుగా పడిగాపులు కాస్తుంటారు
·        వేలకొద్ది ఎలుకలు ఉన్నా ( సుమారు 20-30 వేలు ) కంపు వాసన మాత్రం తక్కువే
·        ఈ ఎలుకల దండు ను చూసిన తర్వాత మనసులో ఓ అనుమానం వచ్చింది ..అమ్మవారు అది గ్రహించారో ఏమో ! దేవేందర్ ద్వారా అనుమాన నివృత్తి చేసాడు..ఎలుకలకు “ప్లేగు” రోగానికి అవినాభావసంబంధం ఉంది , దానికి ప్రధాన కారకం ఎలుకలే , అయితే అదే ఆశ్చర్యం ! వందల సంవత్సరాలుగా ఎలుకతో సహవాసం చేస్తున్నా , ఎలుకలు కొరికిన ఎంగిలి చేసిన ప్రసాదాన్ని , రుచి చూసిన పాలను స్వీకరించినా కూడా, ఈ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా ఆ ఉపద్రవా ఉనికి లేదు ...సూరత్ ను ప్లేగు వణికించిన తర్వాత , పరిశోధకులు ఇక్కడికి వచ్చి శోధించారట! కాని ఏమి తేల్చలేక చేతులేత్తేశారట, సైన్సుకు దొరకని సమాదానం ..అదే “దైవ లీల “
·        సంవత్సరానికి రెండు సార్లు “మేళా” (ఉత్సవాలు/జాతరలు) జరుగుతాయి , వీలాది మంది భక్తులు వస్తారు , అయితే అప్పుడు కూడా అటు భక్తులకు , ఇటూ ఎలుకలకి ఎలాంటి ప్రమాదం , ఇబ్బంది ఉండదట
   అత్యంత వింత అయిన ఈ ఆలయాన్ని దర్శించి, ఎలుకలు స్వీకరించిన ప్రసాదాన్ని , మనస్పూర్తిగా స్వీకరించిన జాబితాలో ఎందరో వి ఐ పి లూ ఉన్నారు .. భారత రాష్ట్రపతులు శ్రీ రాంనాథ్ కోవింద్, శ్రీమతి ప్రతిభా పాటిల్ మరియు ఎంతోమంది మంత్రులు , ముఖ్య మంత్రులు ఉన్నారు..నాకైతే “తెల్ల ఎలుక “ కనపడలేదు కాని, నన్ను అనుగ్రహించమని, మరోసారి వచ్చే భాగ్యం కలిగించమని  అమ్మవారిని మనసార వేడుకొని , “ దేవేందర్ కు జయహో అంటూ , వింత వింతైన అనుభూతులను నెమరేసుకుంటూ అక్కడినుండి బయటపడ్డాను...మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే మిస్ కాకండే ...HAPPY JOURNEY 

31, అక్టోబర్ 2012, బుధవారం

తైమూరు ముచ్చట్లు : ముప్పై నిమిషాల్లొ ముచ్చటైన విదేశీ భాష


                                               

 తూర్పు తైమూరు పన్నెండు లక్షల జనాభా మాత్రమే ఉన్న చిట్టి దేశమే అయినా, ఇక్కడ ప్రజలు మట్లాడే భాశలు పదుల సంఖ్యలో ఉన్నాయి. అత్యధిక తైమూరు ప్రజల వ్యవహారిక భాష "తెతూన్". అయితే   వివిధ రకాల తెగల కారణంగా, ప్రాంతీయంగా అనేక భేదాల కారణంగా "ముంబాసా" లాంటి మాండలీకాలు అనేకం ఉన్నాయి.  అయితే నాలుగు వందల సంవత్సరాల  పోర్చుగీసు వలసపాలన ఆ తర్వాత పాతిక సంవత్సరాల ఇండొనేషియా నియంతృత్వ పాలన వల్ల పోర్చుగీసు మరియు ఇండోనేషియా బహాస భాషలు కూడా తైమూరు లో అంతర్భాగం అయిపొయాయి.దీని వల్ల మెజారిటీ భాశ అయిన " తెతున్" కూడా ప్రభావితం అయ్యింది..ఆయా భాషల నుండి సహజంగానే "ఆదానప్రధానాలు" జరిగాయి..ప్రస్తుతం తైమూరు ప్రజల నిత్యవ్యవహారికం, ఆహారం, అలవాట్లు, సంప్రదాయాలు, కట్టుబొట్టులలోకూడా ఈ రెండు దేశాల ప్రభావం ఉంది. అన్నట్టు.. మా ఉద్యోగ లక్ష్యం  నెరవేరి, పెట్టేబేడా సర్దుకోని స్వంత ఊరికి (అదేనండీ..స్వదేశానికి) బయలుదేరే సమయం వచ్చింది..మరి ఇన్ని రోజులుగా వీనుల విందుగా వినిపించిన ఈ "తెతున్"పలుకుకు, పిలుపులు దూరం అవబోతున్నాయి. అందుకే మొత్తంగా కాకున్నా కొంత మాత్రంగానైనా ఈ భాషను "బ్లాకోల్లెగాస్" అందరికి పరిచయం చేయాలనేది నా ఈ ప్రయత్నం. ప్రస్తుతం మనం ఈ కొత్త "తెతున్" భాషను నేర్చుకోనే ప్రయత్నం చేద్దాం, కొన్ని పదాలు మనకు సుపరిచితమే అనిపిస్తాయి..సరదాగా ఈ కొత్త విదేశీ భాషను ఉపయోగించి మీ హితులను, సన్నిహితులను, స్నేహితులను ఓ ఆట ఆడుకోండి.



Good Morning:                                     బోందియా
Good Afternoon:                                 బొటార్డి
Good Night:                                         బొనైతి
కుటుంబం:                                             ఫమిలా
అమ్మ:                                                  అమ్మా
నాన్న:                                                  అప్పా
సోదరుడు:                                              మావ్
సోదరి:                                                    ఫేతోన్
కుమారుడు:                                            ఓన్
కూతురు:                                            ఓన్ ఫేతో
అంకుల్:                                               ట్యూన్
ఆంటీ :                                                       తియాన్
కజిన్ :                                                         సువ్రీనా
భార్య :                                                        ఫేన్ కాబెన్
భర్త:                                                           లయన్ కాబెన్
అమ్మమ్మ/నాయనమ్మ:                                     అబో ఫేతో
తాతయ్య:                                                    అబో మానే
స్నేహితుడు:                                                   కొల్లెగా                   
                                                   (Girl Friend-కొల్లెగా ఫేతో 
                                                  Boy Friend- కొల్లెగా మానే)
పెద్దమనిషి (Elder person):                                సినరో
నేను :                                                            హౌనియా
నీవు:                                                        ఇత్తవో
మీరు:                                                        ఇత్తబో
అతను:                                                       నియా
ఆమె :                                                             నియాఫేతో
How are you ?
(సర్వసాధారణమైన పలకరింపు)                             డియకలాయ్
Good (బావున్నాను)                                           డియాక్
Not Good (బాలేను)                                          లడియాక్
Cool (ఫర్వాలేదు)                                            మలేరి
Hot ( అంత బాలేను)                                           మానస్

Thanks                                                               ఓబ్రిగాడ
your welcome                                                    నాడా
ఏమిటీ (What)                                                       సైడా
ఎక్కడ (Where)                                                    ఇహన్నబే
ఏది (Which)                                                    ఇత్త
ఎప్పుడు ( When)                                   హాయిర్ బయర్ హీరా
ఎందుకు (Why)                                               తాన్సా
ఎవరు (Who)                                                         సే
ఎలా (How)                                                  ఇత్తా/ హీరా
పేరు                                                               నారన్
ఊరు                                                         సూకో 
                                                                  (హల్దియా-Hamlet)
లవర్                                                           డోమిన్
పరదేశి                                                         మలయ్
Breakfast                                                     మత్తబీసు
Lunch                                                      హన్మూడియా
Dinner                                                      హాన్కాలన్
హన్ హోనా?                                         భోజనం అయిందా?
అయింది/ కాలేదు                               హోనా / సిడావు


ఒకటి నుండి పది వరకు            
ఇడా, రువా, తోలో, హాత్, లీమా, నేన్,  హీతు, వాలో, సియా, సనులో




(కొసమెరుపు: నాకు డాడీ అని పిలిపించుకోవాలంటే పరమ చిరాకు..నా ఓటు "నాన్న" అన్న పిలుపుకే, అయితే భారతీయం అయిన పప్పా, పాపా, బాపు లంటే కూడా ఓకేనే. నా పెద్దకూతురు కొత్తగా మాటలు నేర్ఛుకుంటున్నప్పుడు నాకిష్టమైన "నాన్న,పప్పా,పాపా" లను పిలిపించుకోవాలని తహతహలాడాను. అయితే మా హార్షిణి మాత్రం ఈవేవీ కాకుండా ఆమెకు ఈజీ అయిన "పప్పా"ను "అప్పా" చేసింది. అందరూ ఇదేంటీ ఎక్కడా లేనట్లూ  కన్నడిగుల్లా ఈ "అప్ప"గోలేంటీ అని అనుకున్నా నా కూతురు మాత్రం అలాగే కంటీన్యూ చేసింది.ఆ తర్వాత వచ్చిన "అనన్య"కూడా అక్క బాటలోనే నడుస్తున్నది. ఇక విషయం ఏమిటంటే ఇక్కడికి వచ్చిన కొత్తలో దేశం కాని దేశంలో, మన భాషకాని భాషలో "అప్పా" అని పిల్లలు తమ తండ్రిని పిలుస్తారని తెలిసి, మొదటిసారి ఆ పిలుపు ఇక్కడ విన్నపుడు నా ఆనందానికి అంతూ,పొంతూ లేకుండా పోయింది { ఆవేశపడి అపార్థం చేసుకోకండి, ఇక్కడ నన్నెవరు అలా పిలవలేదు,మా ఇంటి ఓనర్ కొడుకు వాళ్ళ నాన్నను పిలుస్తుండగా వినడం జరిగింది.)... సో వీలైతే మీరు కూడా "అప్పా" అని పిలిపించుకోండే..   " అంతర్జాతీయ అప్పాల సంఘం" పెట్టుకుందాం.)





6, అక్టోబర్ 2012, శనివారం

మేరా భారత్ మహాన్!






                    భారతదేశంలో  చెడ్డీలు వేసుకునే బుడ్డోడి దగ్గరినుండి చెక్కేయడానికి సిద్ధంగా ఉన్న పెద్దాయన దాకా ప్రతీ ఒక్కరికి దేశాన్ని తిట్టిపోయడం అనేది ఓ ఫ్యాషన్.  మనదేశంలో ఇది బాలేదు, అది బాలేదు, చుట్టూ సమస్యలు, పేదరికం, ఎక్కడ చూసినా అవినీతి, ఘారానా రాజకీయాలు, మాయదారి మనుషులు, ఛీ..ఛీ..ఇదేం దేశం..అదే అమేరికాలో అయితేనా, ఇదే బ్రిటన్లో అయితేనా అంటూ గారాలు తీస్తూ మనదేశం మీదా కారాలు, మిరియాలు నూరుతుంటారు.. సొల్యూషన్స్ చెప్పకుండా సమస్యలు చెప్తూ, భాద్యతల గురించి మట్లాడకుండా హక్కుల గురించి లెక్చర్లు ఇస్తుంటారు.  నాకూ అంతలా కాకున్నా ఎప్పుడో,ఒకప్పుడు " ఛీ..ఇదేం దేశంరా బాబు" అని అనుకున్న దాఖలాలు ఉన్నాయి..ఎందుకంటే నేను ఆ తానులో ముక్కనే కదా!

 కాని ఈ తైమూరుకు వచ్చాకా.. నానాజాతి దేశాలవారితో సహావాసం అయ్యాకా, అడ్డమైన అనుభవాలు కలిగాకా, ఓ నాలుగైదు దేశాలు తిరిగాకా అర్థమయ్యింది.." మనమెంతో అదృష్టవంతులమని, ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలితంగా భారతదేశంలో జన్మించామని. 

                         అమెరికా వాడిది ఆర్థికమాంద్యం, యూరోప్ వాడిది అటూ,ఇటూ కాని   త్రిశంఖు స్వర్గం. ఆస్ట్రేలియా,సింగపూర్లో భయంకరమైన జీవనవ్యయం, సామన్యుడు బతకలేని స్థితి.. ఆఫ్రికా  దేశాలవారైతే ఇతరదేశాల వారికి శత్రువుల్లా కనపడుతారు. పాకిస్తాన్, యెమన్ లాంటి దేశాలలో ఏ క్షణాన ఎక్కడ బాంబులు పేలుతాయోననే భయం. ఇలా అన్ని దేశాలలో ఒక్కో రకం గందరగోళం.ఈ సంగతులన్నీ మాతోపాటు ఉద్యోగాలు చేస్తున్న నానాజాతులవారిని " స్కానింగ్" చేశాకా చాలా విషయాలు తెలిసొచ్చాయి.పాశ్చాత్యుల ఆర్థిక, సామాజిక, సాంస్కతిక స్థితి చాలా దుస్థితిలో ఉంది. సంవత్సరాల తరబడి వాళ్ళ దేశాలకు, కుటుంబాలకు దూరంగా ఉన్నా తిరిగి దేశం వెళ్ళాలంటే " పొట్ట" ఎలా గడుస్తుందేమోననే భయం.. ఉద్యోగం దొరుకుతుందో, దొరకదోననే గుబులు.. పెళ్ళికానివారైతే ఎవరి మొగుడిని/పెళ్ళాన్ని వారే వెతుక్కోవాల్సిన దుస్థితి, పైగా దానికి " ఇండివిడ్యువాలిటి, సివిలైజుడు సిటిజెన్స్ లాంటి అడ్డమైన,అందమైన, ఆడంబరమైన పేర్లు. కాని నిజానికి వాళ్ళ తరపున భాధ్యత తీసుకోవడానికి "వెనకా, ముందు" ఎవరూ లేని పరిస్థితే ఈ దుస్థితికి కారణం..కుటుంబ సంబంధాలు అత్యంత దారుణం.. అమ్మానాన్నలను " అనాథ ఆశ్రమాలకు (OLDAGE HOMES)"  వదిలి వీళ్ళేమో "ఆప్యాయతల" కోసం అంగలారుస్తుంటారు.. ఎప్పుడు ఎవరితో ఉంటారో,ఏక్షణాన ఎవరితో చెక్కేస్తారో తెలియని స్థితి. పక్కవాడితో మాట్లాడాలన్నా " కీబోర్డ్ " నువెతుక్కోవాల్సిందే కావాల్సిందే...  పక్కనున్నవాడి " ఫేస్ "చూడలేనంత బిజీ గా ఉంటారు, కాని " ఫేస్ బుక్కులో" గంటలు, గంటలు గడిపేస్తూ ప్రేమలు " పొంగి, పొర్లిస్తుంటారు". మానవసంబంధాల కన్నా " మెషిన్" సంబంధాలకే ఎనలేని ప్రాముఖ్యత..
           
                                    మనదేశంలో కూడా ఆర్థికసంస్కరణల తర్వాత అనేక మార్పులు వచ్చినా,  పాశ్చాత్య ప్రభావిత శాటిలైటు ఛానాళ్ళ " సాంస్కృతిక దండయాత్రల" తర్వాత కూడా మనం ఇంకా మనలాగే ఉన్నాము.. కుటుంబ సంభందాలు, ప్రేమలు, ఆప్యాయతలు కొనసాగుతున్నాయి.. అన్నట్టూ! మన అవినీతికి  ఈ "బంధుప్రీతే" ఓ ప్రధానకారణం కాదూ! ఎవడినైనా తిట్టీ, తెగిడే స్వేఛ్చ కావాల్సినంత ఉంది, ఎక్కడికైనా వెళ్ళే స్వాతంత్ర్యం ఉంది.. మరీ ఎక్కువా, తక్కువా కాకుండా డబ్బులు ఉంటే జిందగీ "జింగలాలా" అనిపించేలా సినిమాలు, కార్లూ, షికార్లు వగైరా బోలెడు ఉన్నాయి... క్వాలిటీ చదువులు ఉన్నాయి, పాపం మన పిల్లలకు పెన్నులే కాని గన్నులు పట్టుకోనే "సంస్కృతి" ఇంకా అలవాటు కాలేదు...
         అయితే మరీ నేను " పాజిటివ్" గా ఉన్నాను, సమస్యల గురించి మట్లాడ్డం లేదంటారా? సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, మిగతా దేశాలతో పోలిస్తే మనం చాలా బెటర్ అంటాను.సమస్య ఉంటేనే మరింత ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. ఆహారసమస్యని ఎదుర్కోవడానికి " హారిత విప్లవం " తెచ్చామని, అమెరికా అవమానం చేసిందని " పరం సూపర్ కంప్యూటర్"ను తయారు చేశామని మరవద్దు.  సమస్యను సమస్యగా కాక ఓ "సవాలు" గా చూడాలి. అందుకే హాక్కుల గురించి తక్కువ మాట్లాడి భాద్యతల గురించి, సమస్యల గురించి బుర్రలు బద్దలుకొట్టుకునే కన్నా " సొల్యూషన్స్" గురించి ఆలోచించమంటున్నాను. 
                          నా ఉద్దేశ్యంలో స్వాతత్ర్యానంతరం దేశంలో అందరికీ ఆదర్శప్రాయుడైన ఒకే ఒక్కడు భారతరత్న, మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు. ఆయన ఆహార్యం, అలవాట్లు, ఆలోచనలు, ఆచరణ ఇలా అన్ని అంశాలలో దేశ ప్రజలందరిని ప్రభావితం చేస్తున్నాడు.. ఆయన ఓ సందర్భంలో ఇచ్చిన ఓ ప్రసంగ పాఠం మీకోసం.. అసలు మిమ్మల్నందరిని ఈ ప్రసంగపాఠం చదివించాలనే ఆలోచనతోనే ఈ పొస్టింగ్ చేస్తున్నాను.. భారతదేశాన్ని ఎవరైనా తులనాడుతున్నప్పుడూ, ఈ దేశాన్ని ఎవరూ బాగుచేయలేరేమోననే నిరాశా, నిస్పృహలు ఆవరించినప్పుడూ అప్పుడప్పుడు ఉత్తేజం కోసం నేను తరుచుగా చదువుతుంటాను.. మీరు చదవండీ, ఆలోచించండి ఆ తర్వాత ఆచరించండీ...
 


Why is the media here so negative?
Why are we in India so embarrassed to recognize our  own strengths, our achievements? 
We are such a great nation. We have so many amazing success stories but we refuse to acknowledge them. 
Why? 
We are the first in milk production
We are number one in Remote sensing satellites
We are the second largest producer of wheat.
We are the second largest producer of rice.
Look at Dr. Sudarshan , he has transferred the tribal village into a Self-sustaining, self-driving unit. There are millions of such achievements but our media is only obsessed in the bad news and failures and disasters. I was in Tel Aviv once and I was reading the Israeli newspaper. It was the day after a lot of attacks and bombardments and deaths had taken place. The Hamas had struck. But the front page of the newspaper had the picture of a Jewish gentleman who in five years had transformed his desert into an orchid and a granary.   It was this inspiring picture that everyone woke up to. The gory details of killings, bombardments, deaths, were inside in the newspaper, buried among   other news. 

In India we only read about death, sickness, terrorism, crime.
Why are we so NEGATIVE? 
Another question: Why are we, as a nation so obsessed with foreign things? 
We want foreign T. Vs, we want foreign shirts. 
We want foreign technology.
Why this obsession with everything imported. 
Do we not realize that..... 
self-respect comes with self-reliance? I was in Hyderabad giving this lecture,
when a 14 year old girl asked me for my autograph. I asked her what her goal in life is. 
She replied: I want to live in a developed India .   For her, you and I will have to build this developed India . You 
must proclaim. India is not an  under-developed nation; it is a highly developed nation. Do you have 10 minutes? Allow me to come back with a vengeance. 
Got 10 minutes for your country? If yes, then read; otherwise, choice is yours.
YOU say that our government is inefficient.
YOU say that our laws are too old. 
YOU say that the municipality does not pick up the garbage. 
YOU say that the phones don't work, the railways are a joke, The airline is the worst in the world, mails never reach their destination.
YOU say that our country has been fed to the dogs and is the absolute pits. 
YOU say, say and say. What do YOU do about it?
Take a person on his way to Singapore . Give him a name - YOURS. Give him a face - YOURS. YOU walk out of the airport and you are at your International best. In Singapore you don't throw cigarette butts on the roads or eat in the stores. YOU are as proud of their Underground links as they are. You pay $5 (approx. Rs. 60) to drive through Orchard Road (equivalent of Mahim Causeway or Pedder Road) between 5 PM and 8 PM. YOU come back to the parking lot to punch your parking ticket if you have over stayed in a restaurant or a shopping mall irrespective of your status identity... In Singapore you don't say anything, DO YOU? YOU wouldn't dare to eat in public during Ramadan, in Dubai . YOU would not dare to go out without your head covered in Jeddah . YOU would not dare to buy an employee of the telephone exchange in London at 10 pounds ( Rs.650) a month to, 'see to it that my STD and ISD calls are billed to someone else.'YOU would not dare to speed beyond 55 mph  (88 km/h) in Washington and then tell the traffic cop, 'Jaanta hai main kaun hoon (Do you know who I am?). I am so and so's son. Take your two bucks and get lost.' YOU wouldn't chuck an empty coconut shell anywhere other than the garbage pail on the beaches in Australia and NewZealand .
Why don't YOU spit Paan on the streets of Tokyo ? 
Why don't YOU use examination jockeys or buy fake certificates in Boston ??? We are still talking of the same YOU. YOU who can respect and conform to a foreign system in other countries but cannot in your own.. You who will throw papers and cigarettes on the road the moment you touch Indian ground. If you can be an involved and appreciative citizen in an alien country, why cannot you be the same here in India ?

Once in an interview, the famous Ex-municipal commissioner of Bombay , Mr. Tinaikar , had a point to make. 'Rich people's dogs are walked on the streets to leave their affluent droppings all over the place,' he said. 'And then the same people turn around to criticize and blame the authorities for inefficiency and dirty pavements. What do they expect the officers to do? Go down with a broom every time their dog feels the pressure in his bowels?
In America every dog owner has to clean up after his pet has done the job. Same in Japan . Will the Indian citizen do that here?' 
He's right. We go to the polls to choose a government and after that forfeit all responsibility.
We sit back wanting to be pampered and expect the government to do everything for us whilst our contribution is totally
negative. We expect the government to clean up but we are not going to stop chucking garbage all over the place nor are we going to stop to pick a up a stray piece of paper and throw it in the bin. We expect the railways to provide clean bathrooms but we are not going to learn the proper use of bathrooms.
We want Indian Airlines and Air India to provide the best of food and toiletries but we are not going to stop pilfering at the least opportunity. 
This applies even to the staff who is known not to pass on the service to the public. When it comes to burning social issues like those related to women, dowry, girl child! and others, we make loud drawing room protestations and continue to do the reverse at home. 
Our excuse? 'It's the whole system which has to change, how will it matter if I alone forego my sons' rights to a dowry.' So who's going to change the system? 

What does a system consist of ? Very conveniently for us it consists of our neighbours, other households, other cities, other communities and the government. But definitely not me and YOU.. When it comes to us actually making a positive contribution to the system we lock ourselves along with our families into a safe cocoon and look into the distance at countries far away and wait for a Mr.Clean to come along & work miracles for us with a majestic sweep of his hand or we leave the country and run away. 
Like lazy cowards hounded by our fears we run to America to bask in their glory and praise their system. When New York becomes insecure we run to England . When England experiences unemployment, we take the next flight out to the Gulf. When the Gulf is war struck, we demand to be rescued and brought home by the Indian government. Everybody is out to abuse and rape the country. Nobody thinks of feeding the system. Our conscience is mortgaged to money. 

Kennedy 's words to his fellow Americans to relate to 
Indians..... 

So my Dear Indians you have to change your attitude towards our nation, Let us stop abusing and start working for the development of our country.

Lets do what India needs from us.

Thank you,

Dr. Abdul Kalaam


 మేరా భారత్ మహాన్!


25, సెప్టెంబర్ 2012, మంగళవారం

తైమూరు ముచ్చట్లు: అందాల రాక్షసి


అందాల రాక్షసి

                         టైటిల్ చూసి ఈ మధ్యనే వచ్చిన  సినిమారివ్యూ అని అనుకుంటున్నారా! అలాంటిదేమి కాదు.. నా మనుసును దోచేసిన ఓ అందమైన ద్వీపం గురించిన రివ్యూ..ఇక మొదలెట్టండి మరి....  తైమూరు కు వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతున్నది, ఇన్ని రోజులుగా ఉంటున్నాను, ఈ దేశాన్ని ఓ లుక్కేయకపోతే బావుండదనిపించింది.అందుకే ఈ మధ్య తైమూరులో "మోస్ట్ పాపులర్ డెస్టినేషన్స్"ఓ రెండింటిని చుట్టేసివచ్చాను. మొదటగా చెప్పాల్సింది "ది బెస్ట్ " నే కాబట్టి దాని గురించే చెప్తాను. ఇది తైమూరు కు తూర్పున చిట్టచివరి దేశ భూభాగం, అత్యంత అందమైన " జాకో ద్వీపం" అందమంటే మామూలు అట్టాంటిట్టాంటి అందం కాదు, అన్నిరకాల కాలుష్యాలకు సుదూరంగా ఉన్న "సహాజ సిద్దమైన ప్రకృతి అందం", సృష్టికర్త మాంచి రొమాంటిక్ మూడ్ లోఉన్నప్పుడు నీలి రంగు నేపథ్యంలో గీసిన అందమైన చిత్రమది.  మాకన్నా ముందుగా ఇక్కడ పని చేసి వెళ్ళిన మా సతీష్ మాటల్లో అయితే అది " భూలోక స్వర్గం". అప్పటినుండి ఎప్పుడెప్పుడా అని వెళ్ళడానికి   నేను, మా ఉమామహేశ్వర్ రావు (హైదారాబాద్ ఇన్స్ పెక్టర్ గారు) స్కెచ్చులు వేస్తున్నాము.  అదీగాక అద్భుత అందాలరాశి అయిన "జాకో"  పుట్టినిల్లు అయిన "లాస్ పాలస్ జిల్లాలో" ఉన్న మా పోర్చుగీసు మిత్రులు ఎప్పుడెప్పుడోస్తారు అంటూ తొందరపెట్టేస్తున్నారు.  

                        ఇక లాభం లేదని తిథి,నక్షత్రాలు, రాహుకాలాలు, వారాలు, వర్జ్యాలు చూసుకోని ( నిజమనుకోనేరు..జోకండీ బాబు) ఓ సుముహుర్తాన మా పంచకళ్యాణి "టయోట ప్రాడో" కారులో బయల్డేరాము. ఇక్కడో చిన్న ట్విస్టు... బయల్దేరుదామని సరుకు సరంజామా, మసాలా,పప్పు దినుసులు ఇలా అన్ని సర్దుకోని “పద పంచకళ్యాణీ” అంటే ఉలుకూ లేదు పలుకూ లేదు, హథవిధి! మొదటి అడుగులోనే మోసం వచ్చిందే, ఇక ముందు ముందు ఏం జరగునుందో అని గుండె " ఢబ ఢబ..ఢబ ఢబ" మని ఢబేలు మంది. ఏదైతేనేమి! అనుకున్నాము, అడుగు వెనక్కు పడరాదు అని డిసైడ్ అయిపోయి వెంటనే" గుర్రాన్ని" మార్చేశాము. ఇక జిందగీ లో మరిచిపోలేని మా  అందాల యాత్ర మొదలయ్యింది. మాఅందాల మజిలీ "జాకో" నేను పని చేస్తున్న "అయిలు జిల్లా"కు దాదాపు 350 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అంటే రానుపోను 700 కిలోమీటర్లన్నమాట. మా పాము మెలికల , మలుపుల రోడ్డును  దాటి దేశ రాజధాని "దిలి" దాటాక (47 కిలోమీటర్ల దూరానికి 450 మలుపులు ఉన్నాయి మరి) ఈ దేశంలోనే " ది బెస్ట్" రోడ్డు పై న పడ్డాము. ఇక పంచకళ్యాణి ని పరుగులు పెట్టిస్తున్న నా ఆనందానికైతే పట్టపగ్గాలు లేవు, ఓ వైపు కేవలం వంద నుండి రెండోందల ఆడుగుల దూరంలో పరుచుకున్నట్లున్న " నీలి సముద్రం " మరో వైపు ఎంత పరుగు తీస్తావో తీయ్ అన్నట్లున్న నునుపైన రోడ్డు. ఆ రోడ్డును చూస్తే మాకైతే ఒక్కసారిగా కరువు జిల్లానుండి కోనసీమకు ట్రాన్స్ ఫర్ అయినట్లనిపించింది. అలా కాలి కింద కళ్యాణిని సుతారంగా తోక్కితే, సర్రున దూసుకెళ్తుంది, అయినా ఏంచేస్తాం మా కళ్యాణి కి "Speed Lock" ఒకటి ఏడ్చి చచ్చింది, స్పీడు ఎక్కువైతే చాలు "కుయ్యో,మొర్రో" అని అరిచేది, బుజ్జిముండ అలా ఎన్ని సార్లు అరిచిగీపెట్టిందో... ఓ రకంగా Speed Lock ఉండడం నయమే అనిపించింది. చుట్టూ ప్రకృతిని, సంగీతాన్ని,ముఖ్యంగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయగలిగాము.  దాదాపుగా మా ప్రయాణం మొత్తం నీలి సముద్రం, నీలాకాశం రెండు పోటీ పడుతున్నట్లున్నాయి, కనుచూపుమేరా పైనా,కిందా పరుచుకోని ఉన్నాయి. ఇక సంగీతప్రియుడు  అయిన మా "రావు"గారు ఓ పక్కనుండి " మేరి సప్నోంకి రాణి కబ్ అయేగితూ అని హిందీ నుంచి మొదలుకొని "మల్లి మల్లి ఇది రాని రోజు"అనే "చిరు" హిట్టు పాటల వరకు  అలా మొబైల్ లో ప్లే చేస్తున్నాడు. ఇక చూసుకోండి మా  ప్రయాణంలోని ఆ రసోద్వేగం,  భావోద్వేగం.... వర్ణణాతీతం, ఆ ఆనందపు అలల సునామీ లో పక్కనున్న సముద్రంలో కొట్టుకపోయాము.

                                    చిన్నప్పటినుండీ నాకు సముద్రం అంటే తెగ ఆరాధనాభావం, అంతులేని ఆ జలరాశి చుట్టూ ఎన్ని ఊహాలు అల్లుకున్నాయో, దానికి కారణం సముద్రానికి కడు దూరంగా ఉండటమే అనుకుంటాను...నాలుగవ తరగతిలో ఉండగా అనుకుంటా,మొదటిసారిగా మా తాత వెంబడి తీర్థయాత్రలలో భాగంగా మద్రాసులో సముద్రాన్ని చూశాను. ఆ కాలంలో టూరిస్ట్ బస్సువాళ్ళు తిరుపతి వెంకన్న దర్శనం తర్వాత ఖచ్చితంగా మద్రాసులో "సినిమా దేవుళ్ళ" దర్శనానికి తీసుకెళ్ళేవారు, అలా వారి పుణ్యాణ నాకు మొదటిసారిగా సముద్ర దర్శనం అయింది..ఇక అప్పటినుండీ కూడా ఇప్పటివరకు సముద్రం అంటే మనసులో అదో రకమైన పిచ్చి ప్రేమ ముదిరిపోయింది, అయినాకూడా ఇప్పటివరకు తనివితీరా సముద్రంతో ఊసులు చెప్పుకోలేదు...ఇదిగో ఇక్కడ సముద్రం పట్ల నాకున్న ఆపేక్ష     చాలా వరకు తీరింది.

ఇక నా "కడలి కహానీ" పక్కన పెట్టి అసలు కహానీలోకి వద్దాం..అయిదు గంటల అలుపెరుగని మా ప్రయాణం తర్వాత రాజధాని"దిలి"తర్వాత రెండవ అతి పెద్ద పట్టణం(?)అయిన "బాకావు" కు చేరుకున్నాము.ఇది పోర్చ్ గీసు వారి ఏలుబడిలో రాజధానిగా ఉండింది, వారి ప్రభావం ఇప్పటికీ స్పష్టంగా కనపడుతుంటుంది.అక్కడ ఉత్తరభారతానికి చెందిన మన మిత్రులున్నారు, వారు  కూడా మాలాగే ఐరాస పోలీసులే.. వారింట్లో సుష్టుగా భోజనం తర్వాత యాత్ర మళ్ళీ మొదలయ్యింది...సాయంత్రం అయిదు వరకు " లాస్ పాలస్" అనే ప్రాంతానికి చేరుకున్నాము. ఓ పోర్చుగీసు హోటళ్ళో దిగాము.. అదేంటో విచిత్రం, ఇక్కడ హోటళ్ళ బాత్రూంలలో బక్కెట్ లాంటివాటి పైన నిషేదం పెట్టినట్టున్నారు, కనపడితే ఒట్టూ! ఒకవేళ ఖర్మ కాలి అడిగినా మనని ఏదో గ్రహాంతరవాసిని చూసినట్లు చూస్తారు..ఆ చూపులవాడి,వేడీ  తట్టుకోలేక అడ్జస్ట్ అయిపోయామనుకోండి.అయినా "తుడుచుకొనే సన్నాసులకు" బక్కెట్లతో ఏంపనండీ బాబు.. ఇక ఆ తర్వాత మా పోర్చ్ గీసు మిత్రుల గృహాన్ని పావనం చేశాము, వారి కోరిక మేరకు నలభీములము రంగంలోకి దిగి, ఇండియన్ స్పెషల్ "చికన్ కర్రీ, దాల్ తడ్కా"లను దడ దడలాడించాము, మన మసాలఘాటులను చల్లని బీరులతో శాంతింపచేసుకుంటూ "ఆహా! ఓహో!" అంటూ ఫుడ్డును ఫుల్లుగా  ఎంజాయ్ చేసారు..మా పాత మిత్రులు డయానా,జార్జ్ లతో పాటు ఓ కొత్త జంట "హ్యూగో,రీటా"లు పరిచయం అయ్యారు...వాళ్ళిద్దరిని చూస్తే అచ్చుపోసిన, ఆదర్శవంతమైన భారతీయ జంటలాగా అనిపించారు, యూరోపియన్లలో అరుదుగా కనిపించే వారి అన్యోన్యతను చూసి తెగ ముచ్చటేసింది..ఎందుకలా అంటూన్నానంటే ఇక్కడికి వచ్చాక పాశ్చాత్య ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య నున్న "మెటీరియలిజం"ను చాలానే చూశాము. ఇక భారతీయ, పాశ్చాత్యముచ్చట్లలో పడి పోయాము, అయినా మా"రావు"గారుంటే ముచ్చట్లకు కొదవే లేదు... ఆ విదేశీ ఔత్సాహికులకు యోగా, ఆయుర్వేదం, తాజ్మహాల్, చార్మినార్, పారడైస్ బిర్యానీ, పుల్లారెడ్డి మిఠాయిలు ఇలా మొత్తం భారతదేశాన్ని ముచ్చటగా మూడుగంటల్లో దర్శనం చేయించాడు, దాంతో ఇక లాభంలేదు ఇండియా ఓసారి రావాల్సిందేని వారు డిసైడ్ అయిపోయారు.
పోర్చుగీసు మిత్రులతో "విందు" భోజనం


రాత్రి ముచ్చట్లతో కాస్తా ఆలస్యంగానే మంచమెక్కినా, ఉదయం ఠంచనుగానే "జాకో"కు బయల్దేరాము..దారి వెంట ఇళ్ళను,పొలాలను,మనుషులను గమనిస్తూ సరదాగా మా పయనం కంటిన్యూ చేశాము.. రోడ్డు వెంబడి అక్కడక్కడ మన ధాబాల్లాగ (అంత పెద్దవి కావులెండి) "రోడ్డు సైడు రెస్టారెంటులు" ఉన్నాయి..అన్నింట్లో కామన్ గా "చికెన్/చేప సీకులు(అదేనండీ కబాబులు)" కాలుస్తున్నారు..నేను పని చేస్తున్న "అయిలూ" ప్రాంతానికి , ఈ ప్రాంతానికి తేడా ఏమిటంటే ఇక్కడ పశువులనైనా, పందులనైనా స్వేఛ్ఛగా పొలాలమీదికి వదిలేశారు, అదే మా అయిలూ లోనైతే ఓ పొడవైన తాడుతో పశువును/పందిని ఓ గుంజకు కట్టేస్తారు,ఇక ఉదయం నుండీ సాయంత్రం వరకు ఆ తాడుపొడుగుతా, గుంజ చుట్టు తిరుగుతూ పొట్ట నింపుకోవాలి (బద్దకం వెధవలూ, పొద్దస్తమానం "పొగలు" పీల్చడం, వదడంలోనే "మహాబిజి").. కాని ఇక్కడ మాత్రం పశువులు,పందులు స్వేచ్చగా తిరుగుతున్నాయి. ఉన్నంతలో పబ్లిక్ కాస్తా రిచ్చుగా అనిపించారు, ఇల్ల్లు,వొల్లు ఒద్దికగా ఉన్నాయి..తైమూరు దేశంలో యాత్రీకుల "టాప్ డెస్టినేషన్" జాకో ద్వీపమే కావడం వలన రోడ్డును ఇప్పుడిప్పుడే బాగు చేస్తున్నారు, వర్షాకాలంలో మాత్రం ఈ రోడ్డు పై అడుగు వేయడం మహకష్టం.
హైలెస్సో! హైలెస్సా!
ఆఖరికి మా మజిలికి అడుగుదూరంలోకి వచ్చేశాము..జాకో ద్వీపానికి ఇవతలి ఒడ్డున తువాతలు అనే బీచ్ ఉంది.. బీచుకు వంద అడుగుల లోపే ఓ రెండు హోటల్లు ఉన్నాయి, ఓ దాంట్లో మేము దూరాము..మామూలు రోజుల్లో అయితే ఒకరో,ఇద్దరో కనపడితే మహాగొప్పట..మేము వెళ్ళింది వారాంతంలో కావడంతో , ఫర్వాలేదు ఆ ప్రాంతం కాస్తా కళాకాంతులు సంతరించుకున్నది.. ఓ మరపడవ ఎక్కి "జాకో"కు బయల్దేరాము..ఇక ప్రకృతి అందాలు చూడాలి.. సముద్రం పూర్తి స్వఛ్ఛంగా అంటే "క్రిస్టల్ క్లియర్" అంటారే అలా కనపడుతున్నది, చుట్టూ నీలి రంగు నీరు, ఆవల ఒడ్డున పచ్చని చెట్లు కాలుష్యానికి కడు దూరంలో పోతపోసినట్లున్న సహజసిద్దమైన అందాల రాశి కాదు "అందాల రాక్షసి" ఆ జాకో ద్వీపం.ఒక్కసారి ఆ ద్వీపంపై అడుగు పడగాని నాలుగుపదుల కు అటూ,ఇటూ ఉన్న మేమిద్దరం పదిలోపుకెళ్ళిపోయాము, ఆ అద్భుత ప్రకృతి అందాలను చూసి పిచ్చ,పిచ్చగా గంతులేశాము,దూకాము,ఈదాము, పొర్లాము, బీచు వెంబడి పోటి పెట్టుకోనిమరీ జాగింగ్ చేశాము. కొద్దిగా ఇక్కడికి రావడం, ఉండడం కష్టమేగానీ ఏ క్రిష్ణవంశి లేదా ఏ పూరీ జగన్నాథో ఒక్కసారి ఇక్కడికి వస్తే డంగయిపోయి షూటింగ్ మొదలుపెట్టాల్సిందే...తనివితీరా సమద్రంలో ఈతేశాము,బోర్ అనిపిస్తే ఒడ్డున ఫారినర్ బిల్డప్ ఇస్తూ బోర్లా పడుకున్నాము, ఆ తర్వాత మళ్ళీ ఈత మొదలు..ఇలా మధ్యాహ్నాం నుండి సాయంత్రం వరకు ఫుల్లు బిజీగా గడిపేశాము..మధ్యలో మాతో పాటు ఓరెండు విదేశీ కుటుంబాలు కలిశాయి.ఒకరేమో బ్రెజిల్ మరోక ఫ్యామిలీ హోండూరస్..వాళ్ళ అమ్మాయిలిద్దరు పన్నెండు సంవత్సరాలవారే అయినా సముద్రం అడుగుకువెళ్ళి "స్టార్ ఫిష్"లను, పగడాలను పట్టుకొచ్చారు.. స్కూబా డైవింగ్ వీరులు, పగడాలు(corals), నత్తగుల్లల వేటగాళ్ళు, ఇలా ఉన్నంతలో సందడిగానే ఉండింది...కొందరికి భొజనం కావాలంటే పడవవాడు సముద్రంలో ఓ చేపను పట్టీ నిప్పుల మీద కాల్చి(Barbeque Fish) అసలుసిసలైన "సీ ఫుడ్డు" రుచి చూపించాడు..అప్పటికే మా సాపాటు అయిపోవడం, దానికితోడు మా"రావు"గారు భయం వ్యక్తం చేయడం వల్ల ఆ "రుచి"ని చూసే అదృష్టాన్ని మిస్సయ్యాము. అప్పటికే చీకటి పడుతుండడం, దానికితోడూ అలలహోరు ఎక్కువవడంతో  అక్కడినుండి బయటపడ్డాము...

గుడారాల విడిది
ఇక మా విడిదికి రాగానే మాకోసం మరో అనుభవం ఎదురుచూస్తున్నది..మేము అల్రేడి దూరిన గది ముందే బుక్కయిపోయిందట..హోటల్ వాడు  “బుక్ చేసినవాళ్ళు” వస్తారో రారోనని ముందయితేమమ్మల్ని దూర్చాడు,ఇక ఇప్పుడు "వాళ్ళోచ్చారు" "ఖాళీ కరో" అని చేతులు పిసుక్కుంటున్నాడు..మేము ససేమిరా అనేవారమే, కాని ఆ బుక్ చేసినవారు మా మిత్రులే కావడంవల్ల మేము అడ్డంగా బుక్కయ్యాం.అలా అడ్డంగా బుక్కవ్వడం మరో రకంగా మంచిదయింది, మరో అందమైన అనుభవాన్ని మిగిలించింది. సముద్రానికి ఎదురుగా ప్లాస్టిక్ టెంటులు ఏర్పాటు చేశారు. ఆ రాత్రి ఆ "చిన్ని గుడారం"లోనే మా బస..రాత్రంతా వీనుల విందు చేస్తున్నట్లున్న ఆ సముద్రపు అలల హోరుకు  మా ఆనందపు పరవళ్ళ  జోరు తోడయితే ఇక "బోరు" అనేది ఉంటుందా? ఇక ఉదయం గుడారంనుండి లేవగానే అలలపైన తేలుతున్నట్లు కనపడిన సూర్యభగవానుడి దర్శనం..Simply Superb..అద్దిరిపోయింది..ఇక ఆ తర్వాత జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలను మేము తీసుకొని మా "అందాల రాక్షసి" జాకో కు వీడ్కోలు చెప్పి బయటపడ్డాము..ఓ పన్నెండు గంటల తర్వాత మా ఊరు "అయిలూ"కు చేరుకున్నాము..దారెంటా "రాక్షసి"గూర్చే ముచ్చట్లు, ఆ తర్వాత రెండు,మూడురోజులు కనపడ్డవాళ్ళకు కూడా "సేం టు సేం"..ఇప్పుడు మీతో పంచుకోవాలనిపించింది, చీప్ అండ్ బెస్ట్ లో మేము మాల్దీవులు, మారిషస్ లకు వెళ్ళొచ్చినట్లయింది, మీరు కూడా ఫ్రీగా ఈ జాకో అందాల రాక్షసి ఆనందపు అలలహోరులో కొట్టుకపొండీ....Enjoy like any thing


 




ఎవరీ బీచుబాబా?

పోర్చుగీసు పోలీసు మిత్రుడితో నేను, ఉమారావ్
ఉషోదయపు పరిమళాలు

జలకాలాటలలో.......
Add caption